ఓర్వేలేక యాసిడ్ పోసిన వ్యక్తికి ఉరి శిక్ష | Ankur Lal Panwar Sentenced to Death in Preeti Rathi Acid Attack Case | Sakshi
Sakshi News home page

ఓర్వేలేక యాసిడ్ పోసిన వ్యక్తికి ఉరి శిక్ష

Published Thu, Sep 8 2016 4:12 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

ఓర్వేలేక యాసిడ్ పోసిన వ్యక్తికి ఉరి శిక్ష

ఓర్వేలేక యాసిడ్ పోసిన వ్యక్తికి ఉరి శిక్ష

ముంబయి: ప్రీతిరాఠి అనే నర్సుపై 2013లో యాసిడ్ దాడి చేసి ఆమె ప్రాణాలుపోయేందుకు కారణమైన నేరస్థుడు అంకుర్ లాల్ పన్వార్కు ప్రత్యేక మహిళల న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. అతడు ఉద్దేశ పూర్వకంగానే ముందస్తుగా ప్రణాళిక వేసుకొని ఈ దారుణానికి పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. ఉరి శిక్ష విధించడానికి ఈ కేసు తగినదని పేర్కొంది. అంతేకాదు, ఇది అత్యంత అరుదుగా జరిగే దాడుల కోవాలోకి వస్తుందని న్యాయస్థానం చెప్పింది.

2013 మే 2న ముంబయిలోని బాంద్రా రైల్వే టర్మనల్లో ఓ రైలు దిగొస్తుండగా అంకుర్ ఆమెపై పెద్ద మొత్తంలో యాసిడ్ కుమ్మరించాడు. దీంతో ఆమె శరీరంలోని అంతర్భాగాలు పూర్తిగా పనిచేయడంమాని జూన్ 1న బొంబే ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో దాడికి పాల్పడిన అంకుర్ ను అరెస్టు చేశారు. ఆమె ఉద్యోగంలో ఎదుగుదలను చూసి ఓర్వలేకే తాను దాడి చేసినట్లుగా అతడు కోర్టులో అంగీకరించాడు. మరోపక్క, అంకుర్ మాత్రమే వాళ్ల కుటుంబానికి దిక్కని అతడి తరుపు న్యాయవాది చెప్పినప్పటికీ న్యాయస్థానం ఏకీభవించలేదు. చివరకు ఉరిశిక్ష ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement