మార్కెట్లోకి రానున్న కొత్త ఐఫోన్‌లు! | Apple to launch new iPhone, iPad on March 15, sasy Report | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి రానున్న కొత్త ఐఫోన్‌లు!

Published Sat, Feb 13 2016 3:47 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

మార్కెట్లోకి రానున్న కొత్త ఐఫోన్‌లు! - Sakshi

మార్కెట్లోకి రానున్న కొత్త ఐఫోన్‌లు!

బెంగళూరు: యాపిల్‌ కంపెనీ వచ్చేనెల 15న కొత్త శ్రేణి ఐఫోన్‌, ఐప్యాడ్‌ మోడల్స్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. అదేవారంలో వీటి అమ్మకాలను కూడా ప్రారంభించే అవకాశముందని 9టు5మ్యాక్‌ బ్లాగ్ వెల్లడించింది.

4 అంగుళాల స్ర్కీన్‌ ఉన్న ఐఫోన్‌ మోడళ్లలను యాపిల్‌ త్వరలో విడుదల చేయనుంది. 'ఐఫోన్‌ 5ఎస్‌ఈ'గా పేర్కొంటున్న ఈ మోడల్‌తోపాట్ సరికిత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ మోడల్‌ను ఒకేసారి విడుదల చేసే అవకాశముంది. అయితే వీటి అమ్మకాల కోసం ముందస్తు ఆర్డర్లు తీసుకొనే అవకాశం లేదని తెలుస్తోంది.  టెక్నాలజీ దిగ్గజమైన యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ల డిమాండ్ తగ్గుతున్నట్టు తాజా ధోరణి స్పష్టం చేసింది. ఐఫోన్‌ లాంచ్‌ అయిన 2007 నుంచి ఎన్నడూలేనిది గత ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా డిమాండ్ పడిపోయింది. ఐఫోన్‌ అమ్మకాల్లో కేవలం 0.4శాతం మాత్రమే నమోదైంది.

ఐఫోన్‌ 6, 6ఎస్‌ మోడళ్ల తరహాలో పూర్తిస్థాయి హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌తో ఐఫోన్‌5ఎస్‌ఈని యాపిల్‌ ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా స్క్రీన్‌ సైజ్‌ పెరగకుండానే ఫాస్టెస్‌ డివైస్‌ను యూజర్లకు అందించే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement