బ్యాంక్ లోన్ ఉంటే జాబ్ అప్లికేషన్లు రిజెక్ట్!
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారా? మీరు కొన్ని విషయాలు గమనించాల్సిందే. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ బ్యాంకు లోన్లలో బాకీలు లేకుండా ఉండేలా చూసుకోండి... లేకపోతే మీ జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, జూనియర్ అగ్రికల్చర్ అసోసియేట్స్లో క్లరికల్ స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి బ్యాంకుల్లో ఎటువంటి బాకీలు ఉండకూడదని ఎస్బీఐ తాజాగా ఇచ్చిన ప్రకటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
పోస్టులకు దరఖాస్తులు చేసే ముందు అభ్యర్ధుల తమ ఖాతాల్లో ఉన్న అప్పుల వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్(సీఐబీఐఎల్) ను పరిశీలించుకోవాలని బ్యాంకు సూచించింది. దీంతో విద్య కోసం బ్యాంకు లోన్లు తీసుకున్న విద్యార్ధులను దీని మినహాయింపు ఇవ్వాలంటూ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఎస్బీఐని కోరింది.