
17న బీజేపీలోకి డీఎస్ కుమారుడు అరవింద్!
వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు అరవింద్ ధర్మపురి సెప్టెంబర్ 17న బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటు న్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా అరవింద్ బీజేపీలో చేరుతున్నారన్న ఊహాగానా లకు బలం చేకూర్చే విధంగా శనివారం ఆయన ఢిల్లీలో బీజేపీ ఆర్గనైజేషన్ ఇన్‌చార్జి రాంలాల్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లతో భేటీ అయ్యారు. ఈ భేటీతో బీజేపీలో అరవింద్ చేరిక ఇక లాంఛనమే అని తెలు స్తోంది.
ఇరువురు నేతలతో భేటీ సందర్భంగా బీజేపీలో చేరికపై అరవింద్ తన ఆకాంక్షను వ్యక్తం చేసినట్టు సమా చారం. ప్రధాని మోదీ విధానాలు నచ్చి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పినట్టు తెలిసింది. నిజామాబాద్‌లో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ భారీ స్థాయిలో చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సభ సందర్భంగా అరవింద్ పెద్ద ఎత్తున తన అనుచరులతో కలసి పార్టీలో చేరే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున అరవింద్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.