మొబైల్స్ వల్లే అత్యాచారాలు.. వేధింపులు! | ban mobile phones in schools,colleges to stop rapes karnataka legislative committee | Sakshi
Sakshi News home page

మొబైల్స్ వల్లే అత్యాచారాలు.. వేధింపులు!

Published Sun, Jul 13 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

మొబైల్స్ వల్లే అత్యాచారాలు.. వేధింపులు!

మొబైల్స్ వల్లే అత్యాచారాలు.. వేధింపులు!

స్కూళ్లు, కాలేజీల్లో వాటిని  నిషేధించాలి
కర్ణాటక సర్కారుకు శాసనసభా కమిటీ వివాదాస్పద సిఫారసు

 
బెంగళూరు: అత్యాచారాలు, లైంగిక వేధింపులను నియంత్రించాలంటే పాఠశాలలు, కళాశాలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధం విధించాలని కర్ణాటక శాసనసభా కమిటీ సిఫారసు చేయడం వివాదాస్పదమైంది. స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం విధించేలా విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేయాలని స్త్రీ, శిశు సంక్షేమంపై ఏర్పాటైన శాసనసభా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ  నివేదికను సమర్పించింది. శకుంతలా శెట్టి నేతృత్వంలోని ఈ కమిటీ ఇచ్చిన నివేదిక శుక్రవారం అసెంబ్లీ ముందుకొచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే బాలికలపై రేప్, అదృశ్యం కేసులను పరిశీలించగా..

దీనికి మొబైల్ ఫోన్లే కారణమని వెల్లడైందని శకుంతలా శెట్టి సమర్థించుకున్నారు. ముగ్గురు అత్యాచార బాధిత బాలికలను ప్రశ్నించామని, మిస్డ్‌కాల్‌తో మొదలైన పరిచయాలు రేప్‌లకు దారి తీసినట్టు గుర్తించామని చెప్పారు. అందువల్లే స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం విధించాలన్నారు. మహిళలపై వేధింపులకు సంబంధించి స్కూళ్లు, కాలేజీల్లో  అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీసుల పనితీరును మెరుగు కోసం పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి స్టేషన్లో 20 శాతం మంది మహిళా పోలీసులను నియమించాలని ఈ కమిటీ  సిఫారసు చేసింది.
 
 7.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement