Legislative committee
-
హౌసింగ్ సొసైటీల అక్రమాలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో జరుగుతున్నఅక్రమాలకు చెక్ పెట్టే దిశలో కార్యాచరణ వేగం పుంజుకుంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఏర్పాటైన శాసన సభ కమిటీ (హౌస్ కమిటీ) గురువారం అసెంబ్లీలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ ఆరూరి రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సరైన సమాచారం ఇవ్వకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ సొసైటీల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ఆరా తీసేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరపాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. వచ్చే నెల 1న మరోసారి భేటీ కావాలని, అదే రోజు జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ సొసైటీల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఆయా సొసైటీల్లో అక్రమంగా భూములు చేజిక్కించుకుని నిర్మించిన పెద్ద భవనాలు, వాటి యజమానుల వివరాలను కూడా బయట పెట్టాలన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ద్వారా సమాచారం సేకరించామని, వాస్తవాలు రాబట్టి పూర్తి స్థాయి నివేదికను శాసనసభకు అందజేస్తామని రమేశ్ పేర్కొన్నారు. -
మొబైల్స్ వల్లే అత్యాచారాలు.. వేధింపులు!
స్కూళ్లు, కాలేజీల్లో వాటిని నిషేధించాలి కర్ణాటక సర్కారుకు శాసనసభా కమిటీ వివాదాస్పద సిఫారసు బెంగళూరు: అత్యాచారాలు, లైంగిక వేధింపులను నియంత్రించాలంటే పాఠశాలలు, కళాశాలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధం విధించాలని కర్ణాటక శాసనసభా కమిటీ సిఫారసు చేయడం వివాదాస్పదమైంది. స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం విధించేలా విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేయాలని స్త్రీ, శిశు సంక్షేమంపై ఏర్పాటైన శాసనసభా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదికను సమర్పించింది. శకుంతలా శెట్టి నేతృత్వంలోని ఈ కమిటీ ఇచ్చిన నివేదిక శుక్రవారం అసెంబ్లీ ముందుకొచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే బాలికలపై రేప్, అదృశ్యం కేసులను పరిశీలించగా.. దీనికి మొబైల్ ఫోన్లే కారణమని వెల్లడైందని శకుంతలా శెట్టి సమర్థించుకున్నారు. ముగ్గురు అత్యాచార బాధిత బాలికలను ప్రశ్నించామని, మిస్డ్‌కాల్‌తో మొదలైన పరిచయాలు రేప్‌లకు దారి తీసినట్టు గుర్తించామని చెప్పారు. అందువల్లే స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం విధించాలన్నారు. మహిళలపై వేధింపులకు సంబంధించి స్కూళ్లు, కాలేజీల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీసుల పనితీరును మెరుగు కోసం పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి స్టేషన్లో 20 శాతం మంది మహిళా పోలీసులను నియమించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. 7. -
అత్యాచారాలకు మొబైల్ ఫోన్లే కారణం:శాసనసభా కమిటీ
బెంగళూరు: అత్యాచారాలు, లైంగిక వేధింపులను నియంత్రించాలంటే పాఠశాలలు, కళాశాలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధం విధించాలని కర్ణాటక శాసనసభా కమిటీ సిఫారసు చేయడం వివాదాస్పదమైంది. స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం విధించేలా విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేయాలని స్త్రీ, శిశు సంక్షేమంపై ఏర్పాటైన శాసనసభా కమిటీ కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఓ నివేదికను సమర్పించింది. శకుంతలా శెట్టి నేతత్వంలోని 23 మంది సభ్యుల కమిటీ సమర్పించిన ఈ నివేదిక శుక్రవారం అసెంబ్లీ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, ఈ తరహా ఘటనల వల్ల ప్రపంచం ముందు మన దేశం తలదించుకోవాల్సి వస్తోందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే బాలికలపై అత్యాచారాలు, అదృశ్యం కేసులను పరిశీలించగా, దీనికి మొబైల్ ఫోన్లే కారణమని వెల్లడైందని శకుంతలా శెట్టి సమర్థించుకున్నారు. అత్యాచారాలకు గురైన ఇద్దరు, ముగ్గురు బాలికలను తాము ప్రశ్నించామని, మిస్డ్ కాల్‌తో మొదలైన పరిచయాలు అత్యాచారాలకు దారి తీసినట్లుగుర్తించామని చెప్పారు. అందువల్లే స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం విధించాలని సూచించామన్నారు. మహిళలపై వేధింపులకు సంబంధించి స్కూళ్లు, కాలేజీల్లో తరచుగా సెమినార్లు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీసుల పనితీరును మెరుగు పరిచేందుకు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి స్టేషన్లో 20 శాతం మంది మహిళా పోలీసులను నియమించాలని, మరిన్ని మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.