బర్త్ డేకి పిలిచి సామూహిక రేప్..
బెంగళూరు: పుట్టిన రోజు వేడుకకు పిలిచి ముగ్గురు వ్యక్తులు ఓ 26 ఏళ్ల మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బెంగళూరులో ఈ నెల (మే)15న చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మంగళవారం సాయంత్రం ముగ్గురుని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ 26 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తోంది. బాబు అనే వ్యక్తి తన పుట్టిన రోజు పార్టీకంటూ ఆమెను ఆహ్వానించాడు. దీంతో ఆమె పార్టీకి వెళ్లగా అతడు భుక్తియార్, ఖలీద్ అనే మరో ఇద్దరు స్నేహితులతో కలసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు మరుసటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.