సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ రెండో రోజు కొనసాగుతోంది. కార్మిక సంఘాల నాయకుల చేపట్టిన బంద్ బెంగాల్‌లో కొంత హింసాత్మకంగా మారింది. బెంగాల్‌లో రోడ్డుపైకి వచ్చిన వాహనాలపై ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో వాహనాల అద్దాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ త్రీవంగా గాయపడ్డాడు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపున్న సీపీఎం నేత సుజన్ చౌదరీను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.
దేశ వ్యాప్తంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా 32వేల మంది కార్మికులు బంద్‌ను పాటిస్తున్నారు. కార్మికుల హక్కులకై వారు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో కూడా రెండో రోజు బంద్ కొనసాగుతోంది. తిరువనంతపురంలో రైలు పట్టాలపై కార్మికులు బైఠాయించడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు 12 డిమాండ్‌లను ఉంచిన విషయం తెలిసిందే. రెండు రోజుల బంద్‌కు పది ట్రేడ్ యూనియన్లు మద్దుతు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment