
అప్పుడే స్వీట్లు పంచేసుకున్నారు!
బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న బీజేపీ.. జమ్ము కాశ్మీర్లో కూడా అనుకున్నదాని కంటే మెరుగైన ఫలితాలనే సాధిస్తోంది. దాంతో కమలనాథులు ఆనందంలో తేలియాడుతున్నారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. అక్కడ కమలనాథులు స్వీట్లు పంచుకున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 81 స్థానాలకు గాను బీజేపీ 41 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేఎంఎం 20 చోట్ల, జేవీఎం 9 చోట్ల, కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. జమ్ము కాశ్మీర్లో కూడా బీజేపీ కాస్త ముందంజలోనే ఉంది. అక్కడ పీడీపీ 24, బీజేపీ 23, నేషనల్ కాన్ఫరెన్స్ 17, కాంగ్రెస్ 15 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి.