
'రాజన్ పోయాడు.. ఇక కేజ్రీవాల్ సంగతి తేలుస్తా'
న్యూఢిల్లీ: తాను ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెంటపడ్డానని, ఆయన వెళ్లిపోయాడని ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంగతి తేలుస్తానని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. కేజ్రీవాల్ నివాసం బయట నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ నేత మహేశ్ గిరి వద్దకు వెళ్లిన ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
'కేజ్రీవాల్ జీవితం మొత్తం కూడా మోసంతో నిండినదే. తాను ఐఐటీలో మెరిట్ విద్యార్థినని కేజ్రీవాల్ చెప్తాడు. కానీ అసలు ఆయనకు అందులో ఎలా అడ్మిషన్ వచ్చిందో నేను త్వరలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బహిరంగంగా చెబుతా. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఇప్పటి వరకు రఘురాం రాజన్ వెనుక పడ్డాను. ఇప్పుడు ఆయన వెళ్లిపోయారు. ఇప్పుడు కేజ్రీవాల్ వంతు' అంటూ స్వామి సంచలన వ్యాఖ్య చేశారు.