
తండ్రి సిఫార్సులతోనే కేజ్రీకి ఐఐటీ సీటు: స్వామి
తిరువనంతపురం: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఐఐటీలో ఆయన తండ్రి సిఫార్సులపై సీటు వచ్చిందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. అది కష్టపడి చదివి తెచ్చుకున్న సీటు కాదని అన్నారు. దమ్ముంటే తను అక్రమంగా సీటు పొందినట్లు కేజ్రీవాల్ ఒప్పుకోవాలని స్వామి సవాల్ విసిరారు. సహ దరఖాస్తు కింద వచ్చిన సమాచారంతో ఆయన ఈ ఆరోపణలు చేశారు.
‘ఐఐటీలోకి మెరిట్ ఆధారంగా కేజ్రీవాల్ సీటు పొందారా? లేక అక్రమంగానా? సమాచార హక్కు ద్వారా వచ్చిన వివరాల్లో ఆయన ర్యాంకు సాధించి కాకుండా మరో పద్ధతిలో సీటు పొందారని స్పష్టంగా ఉంది’ అని సుబ్రహ్మణ్య స్వామి వివరించారు. కాగా, 2011-12 మధ్య కాలంలో ‘హిందూ ఉగ్రవాదం’ పేరుతో దేశంలో ఎమర్జెన్సీ తీసుకువచ్చేందుకు సోనియా గాంధీ ప్రయత్నించారని స్వామి ఆరోపించారు.