న్యూఢిల్లీ : గుజరాత్‌లో మరోసారి కమలమే వికసిస్తుందని ఏబీపీ-సీఎస్‌డీఎస్ సర్వే స్పష్టం చేసింది. సుదీర్ఘకాలం తరువాత గుజరాత్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి నిరాశ తప్పదని సర్వే ప్రకటించింది. అయితే మొదటి సర్వేతో పోలిస్తే.. తాజా సర్వేలో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశముందని తెలిపింది.
సర్వే ముఖ్యాంశాలు
- ఏబీపీ-సీఎస్‌డీఎస్ సర్వే అంచనాల మేరకు భారతీయ జనతా పార్టీకి 113 నుంచి 121 సీట్లు వస్తాయి.
- అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 64 సీట్లు లభిస్తాయి.
- బీజేపీకి 47 శాతం ఓట్ షేర్, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వే అంచనా వేస్తోంది. గత సర్వేతో పోలిస్తే బీజేపీ ఓట్ షేర్ 11 శాతం తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్ 12 శాతం ఓట్ షేర్‌ను పెంచుకోవడం విశేషం.
- ఉత్తర గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంది.
- సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు రీజియన్లలో మొత్తం 107 స్థానాలు ఉండడం విశేషం.
- మధ్య, దక్షిణ గుజరాత్‌లో బీజేపీ పూర్తి మెజారిటీ స్థానాలు సాధించనుంది.
Comments
Please login to add a commentAdd a comment