
జార్ఖండ్ లో కమలం.. జమ్మూలో సంకీర్ణం!
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. 81 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 42 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం చేసుకుంది. అయితే అధికార జేఎంఎం మాత్రం 18 సీట్లకే పరిమితం కాగా, జేవీఎం 7 సీట్లతో మూడో్ స్థానంలో నిలిచింది. కాగా, కాంగ్రెస్12 సీట్లను మాత్రమే కైవశం చేసుకుని ఊరట చెందింది. ఈ ఎన్నికల్లో ఇతరులు ఏడు స్థానాల్లో గెలుపొందడం గమనార్హం.
ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్ లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో జమ్మూలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూలో పీడీపీ 28 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 25సీట్లతో రెండో స్థానాన్ని కైవశం చేసుకుంది. ఇక్కడ అధికార ఎన్సీ (నేషనల్ కాన్ఫిరెన్స్) 15 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ కు 6 స్థానాలు దక్కాయి. ఈసారి బీజేపీ గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకుని పీడీపీతో పోటీ పడింది.