సాక్షి, చెన్నై: సాటి మనిషిని కాపాడేందుకు ఆయన వ్యయ ప్రయాసలు లెక్క చేయలేదు. పలువురికి ఆదర్శంగా మానవత్వాన్ని నిరూపించుకున్నాడు. గర్భిణిని కాపాడేందుకు ఓ బెంగుళూరు వాసి అక్కడి నుంచి చెన్నైకు వచ్చి రక్తదానం చేశాడు. ఈ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విల్లుపురం జిల్లా కల్లకురిచ్చికి చెందిన మైథిలి అనే మహిళ తన రెండో ప్రసవం కోసం చెన్నై ఎగ్మూరులోగల స్త్రీ, శిశు సంక్షేమ ఆస్పత్రిలో చేరారు. ఈమెకు రక్తగ్రూ పుఅత్యంత అరుదైన హెచ్‌హెచ్ (బాంబే బ్లడ్ గ్రూప్) అని తేలింది. ఆస్పత్రిలో ఆమెకు రక్తం ఎక్కిస్తేనే ప్రసవం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్తం ముంబై బ్లడ్ డొనేషన్ క్లబ్‌లో నమోదు చేసుకున్నా దొరకలేదు.
ఆదిత్య హెగ్డే గొప్పమనసు
ఈ గ్రూప్ బ్లడ్ బెంగుళూరు ఫైనాన్స్ సంస్థలో అధికారిగా పనిచేస్తున్న ఆదిత్య హెగ్డే (33)కు ఉన్నట్లు తెలిసింది. అతను ఈ విషయం తెలుసుకుని రక్తదానం చేసేందుకు ముందుకొచ్చాడు. బెంగుళూరు నుంచి రైలులో చెన్నైకి చేరుకుని మైథిలికి రక్తదానం చేశారు. తర్వాత మైథిలికి సుఖ ప్రసవం జరిగింది. ఆదిత్య హెగ్డే మాట్లాడుతూ తాను ఇంతవరకు 55 సార్లు రక్తదానం చేశానని, తన రక్తం అరుదైనది కావడంతో ఇక్కడి నుంచి సేకరించి విదేశాలకు పార్సిల్ ద్వారా పంపుతున్నట్లు తెలిపారు. మలేషియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు చెందినవారికి ఈ విధంగా పంపానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment