'బోగస్ రేషన్ కార్టులను ఏరివేస్తాం' | Bogus ration cards in Goa to be discarded post digitisation | Sakshi
Sakshi News home page

'బోగస్ రేషన్ కార్టులను ఏరివేస్తాం'

Published Tue, Aug 19 2014 1:41 PM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

Bogus ration cards in Goa to be discarded post digitisation

పానాజీ: వేలాది బోగస్ రేషన్ కార్డులను ఎత్తివేయడానికి గోవా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిజిటలైజేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత బోగస్ కార్టులను ఏరివేస్తామని గోవా పౌర సరఫరాల శాఖా మంత్రి దయానంద్ మండ్రేకర్ శాసనసభకు తెలిపారు. 
 
ఇప్పటికే రేషన్ కార్డుల డిజిటలైజేషన్ కార్యక్రమం కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వేలాది బోగస్ కార్డులు ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఉందని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోవా రాష్ట్రంలోని బర్డేజ్ తాలుకాలో 70 రేషన్ కార్డులకు గాను.. 44 వేల కార్టులను డిజిటలైజేషన్ పూర్తయిందని మంత్రి మండ్రేకర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement