భారత్‌కు వెళ్తున్నారా.. జాగ్రత్త: చైనా | Border standoff: China issues 'safety advisory' for its citizens travelling to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు వెళ్తున్నారా.. జాగ్రత్త: చైనా

Published Sat, Jul 8 2017 4:47 PM | Last Updated on Mon, Aug 13 2018 3:32 PM

భారత్‌కు వెళ్తున్నారా.. జాగ్రత్త: చైనా - Sakshi

భారత్‌కు వెళ్తున్నారా.. జాగ్రత్త: చైనా

న్యూఢిల్లీ: చైనా-భారత్‌ సరిహద్దులో ఉద్రిక్తతల దృష్ట్యా భారత్‌లో ఉంటున్న చైనా పౌరులకు న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ భద్రతా సూచనలు చేసింది. భారత్‌కు వస్తున్న పౌరులు భద్రతా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది.

భారత్‌కు వస్తున్న పౌరులకు భద్రతా సూచనలు చేయడంపై మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు.. తాము జారీ చేసిందని కేవలం సూచన మాత్రమేనని అలర్ట్‌ ఏమాత్రం కాదని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 5వ తేదీన భారత్‌ను సందర్శిస్తున్న చైనా పౌరులకు అలర్ట్‌ జారీ చేసే విషయంపై ఆలోచిస్తామని చైనా విదేశాంగ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement