గుజరాత్ నుంచి స్వస్ధలాలకు తరలివెళుతున్న వలస కార్మికులు
లక్నో : గుజరాత్‌లో పద్నాలుగు నెలల పసికందుపై బిహార్ వలస కార్మికుడి లైంగిక దాడి నేపథ్యంలో గుజరాతేతర వలస కార్మికులపై దాడులు జరుగుతున్న క్రమంలో కూలీల కొరత వెంటాడుతోంది. పండుగ సీజన్‌లో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కొరవడటంతో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పుపట్టారు. యూపీ, బిహార్‌కు చెందిన కార్మికులకు ప్రధాని ఎలాంటి సాయం చేయడం లేదని మండిపడ్డారు.
వారణాసి నుంచి మోదీజీని గెలిపించిన వారిని గుజరాత్‌లో టార్గెట్ చేయడం బాధాకరమని మాయావతి వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా వలస కూలీలకు భద్రత కల్పిస్తామని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుజరాత్ సర్కార్ హామీ ఇచ్చింది. దాడులకు పాల్పడిన 431 మందిని అరెస్ట్ చేసి, 56 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు హింసకు పాల్పడరాదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment