ఓబీసీ జాబితాలో మరికొన్ని కులాలు
Published Wed, Aug 3 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
న్యూఢిల్లీ : ఓబీసీ జాబితాలో నూతనంగా మరో 121 కులాలను చేర్చేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 35 కులాలు, తెలంగాణ ప్రతిపాదించిన 86 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓబీసీ జాబితాలో చేర్చడం వల్ల ఆయా కులాల వారు కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన 27 శాతం రిజర్వేషన్ సౌకర్యం పొందే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలుగా గుర్తించిన కులాలలో కొన్ని కులాలు ఒబీసీ కులాల జాబితాలో గుర్తింపు పొందకపోవటంతో కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు ఆయా కులాలకు వర్తించట్లేదు. ఫలితంగా వారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందాల్సిన విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల సౌకర్యాలను కోల్పోతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ పథకాల కుదింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీతి ఆయోగ్ కింద ఏర్పడిన ముఖ్యమంత్రుల బృందం కేంద్ర ప్రభుత్వ పథకాలను పరిశీలించి 30కి తగ్గించాలని సిఫార్సు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పథకాలు 66 నుంచి 30కి తగ్గింపుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
Advertisement
Advertisement