సహకార బ్యాంకులకు నగదు సాయం
బ్యాంకులకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: రైతుల నగదు అవసరాలు తీర్చేందుకు సహకార బ్యాంకులకు సాయం చేయాలని బ్యాంకులకు కేంద్రం సూచించింది. ఈ విషయమై ఆర్‌బీఐ, నాబార్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో చర్చించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులకు వారానికి కావాల్సిన నగదు మొత్తంపై నాబార్డ్ నివేదిక సమర్పించిందని, అనుబంధంగా ఉన్న సహకార బ్యాంకుకు బ్యాంకులు తగిన వనరులు సమకూర్చాలని నిర్ణరుుంచామన్నారు.
రూ. 10 నాణేలు చెల్లుబాటు అవుతాయి
పాత, కొత్త 10 రూపారుుల నాణేలు చెల్లుబాటు అవుతాయనీ, వదంతులను నమ్మవద్దని ఆర్‌బీఐ సోమవారం వెల్లడించింది. ఏ కొనుగోలుకై నా రూ. 10 నాణేన్ని వాడుకోవచ్చంటూ స్పష్టం చేసింది.
చేనేత, చేతివృత్తుల సొసైటీల్లో మైక్రో ఏటీఎంలు
చేనేత, చేతివృత్తుల సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. బ్యాంకు అధికారులతో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
రూ. 4.8 లక్షల నకిలీ 2 వేల నోట్ల పట్టివేత
ఒడిశాలో రూ. 4.8 లక్షల మేర 2 వేల నకిలీ నోట్లు మారుస్తోన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోల్ బంకులో నకిలీ కరెన్సీ మారుస్తుండగా ఝార్సుగూడకు చెందిన మధుసూదన్ మెహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 2 వేల నోటుకు కలర్ జిరాక్స్ తీసి వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.