న్యూఢిల్లీ: సియాచిన్ ప్రమాదంలో కొన ఊపిరితో బయటపడి చివరకు ప్రాణాలుకోల్పోయిన భారత వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్పకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ఆర్థికశాఖ లాన్స్ నాయక్ హనుమంతప్పకు ఘన నివాళి అర్పించింది. తన ట్విటర్ ఖాతాకు లాన్స్ నాయక్ చాయా చిత్రాన్ని వాల్ పేపర్గా ఉంచి అంజలి ఘటించారు. ఈ నెల 3న 19,600 అడుగుల ఎత్తులోని సియాచిన్ యుద్ధ క్షేత్రంలో తమ సైనిక శిబిరంపై భారీ ఎత్తున మంచుకొండ చరియలు విరిగిపడటంతో మొత్తం పదిమంది సైనికులు ఆ శకలాల కిందపడిపోయిన విషయం తెలిసిందే.
అయితే, వారిలో హనుమంతప్ప మాత్రమే ఆశ్చర్యపరుస్తూ ఆరు రోజులపాటు మంచు దిబ్బల కింద ఉన్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, అతడి శరీరంలోని పలు అవయవాలు పనిచేయడం ఆగిపోవడం కారణంగా గురువారం ఉదయం ప్రాణాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా దేశం మొత్తం నివాళి అర్పించగా కేంద్ర ఆర్థికశాఖ ట్విట్టర్ ఖాతాకు లాన్స్ నాయక్ ఫొటోను ఉంచి నివాళి అర్పించింది. 'వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప ఇక లేడని వార్తా తీవ్రంగా బాధిస్తోంది. ఆయన కుటుంబం ఈ బాధను తట్టుకోగలిగి ధృడంగా నిలబడాలని కోరుకుంటున్నాను' అని అరుణ్ జైట్లీ అన్నారు. ఈరోజు హనుమంతప్ప అంత్యక్రియలు జరగనున్నాయి.
వీర జవానుకు అరుదైన గౌరవం
Published Fri, Feb 12 2016 11:15 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM
Advertisement