పీయూష్‌ గోయల్‌కు అదనపు బాధ్యతలు | Piyush Goyal As Interim Financial Minister | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న పీయూష్‌ గోయల్‌

Published Wed, Jan 23 2019 10:28 PM | Last Updated on Wed, Jan 23 2019 10:28 PM

Piyush Goyal As Interim Financial Minister - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతుండటంతో ఆ శాఖ తాత్కాలిక బాధ్యతలను గోయల్‌ చూసుకోనున్నారు. పార్లమెంటులో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. జైట్లీ తిరిగి బాధ్యతల్లో చేరే వరకు గోయల్‌ ఈ బాధ్యతలను చేపట్టనున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 1న కేంద్రం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement