కెమెరాకు చిక్కిన కానిస్టేబుల్‌ నిర్వాకం | Caught On Camera Molesting 2 Girls, UP Cop Suspended | Sakshi
Sakshi News home page

కెమెరాకు చిక్కిన కానిస్టేబుల్‌ నిర్వాకం

Published Sun, Jun 4 2017 4:02 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

కెమెరాకు చిక్కిన కానిస్టేబుల్‌ నిర్వాకం - Sakshi

కెమెరాకు చిక్కిన కానిస్టేబుల్‌ నిర్వాకం

లక్నో: ఇద్దరు మైనర్లను లైంగికంగా వేధించిన ఓ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు చేసిన చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ హల్‌చల్‌ చేస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ పోలీసు మాత్రం తాను వారిని ఏమీ అనలేదని, కేవలం ఇంటికి వెళ్లాలని మాత్రమే సూచించానని అంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈశ్వరీ ప్రసాద్‌ అనే ఓ వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఓ మంచంలో పడుకొని అక్కడే ఉన్న ఇద్దరు మైనర్లలో ఒకమ్మాయి చేయి పట్టుకోబోయాడు. ఆ బాలిక నిరాకరించడంతో లైంగికంగా వేధింపులు చేసే ప్రయత్నం చేశాడు.

ఈ వీడియోనే బయటకు రావడంతో అతడికి కష్టాలు మొదలయ్యాయి. అయితే, ఆ సమయంలో వారిని ఇంటికి వెళ్లాలని చెప్పేందుకే చేయిపట్టుకున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదని చెబుతున్నాడు. ప్రస్తుతానికి పోస్కో యాక్ట్‌ ప్రకారం ప్రసాద్‌పై కేసు నమోదు చేశామని, విచారణ కచ్చితం‍్గా ఉంటుందని పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ రాజేశ్‌ ఎస్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో లైంగిక వేధింపులు నియంత్రించేందుకు యాంటీ రోమియో స్క్వాడ్స్‌ టీములు ప్రయత్నం చేస్తుండగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement