
న్యూఢిల్లీ/కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్ కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను ఈ నెల 9వ తేదీన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారించనున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపినట్లు తెలిపింది. ఇటీవల కోల్‌కతాలోని రాజీవ్‌కుమార్ నివాసంలో సోదాలకు వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు నిర్బంధించడం, సీఎం మమతాబెనర్జీ ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్ ఘోష్‌ను కూడా ఈ నెల 10వ తేదీన షిల్లాంగ్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని సీబీఐ కోరింది. (శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?)
Comments
Please login to add a commentAdd a comment