సెలబ్రిటీలూ.. బాధ్యతగా వ్యవహరించండి
న్యూఢిల్లీ: నాణ్యతలేని, తప్పుదారి పట్టించే బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించే విషయంలో సెలబ్రిటీలు బాధ్యతగా నడుచుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్(సీసీపీసీ) మంగళవారం సూచించింది.
సీసీపీసీ సమావేశంలో కౌన్సిల్ చైర్మన్, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీలకు మార్గదర్శకాలు ఉండాలి. అంబాసిడర్‌గా సంతకం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మా బ్రాండ్ మందు వాడితే ఆర్నెల్లలో ఎత్తు పెరుగుతారు అంటూ ప్రకటన చేస్తుంటారు. అది సమంజసమా.. కాదా.. అన్నది ఆలోచించాలి’ అని సూచించారు.