సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో విద్వేషపూరిత, రెచ్చగొట్టే, తప్పుడు వార్తలను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు చేసింది. ఈ మేరకు సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో వదంతులు, నకిలీ వార్తల సమాచారంపై హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా వాట్సాప్‌లో వదంతులతో ప్రజలు అమాయకులపై భౌతిక దాడికి దిగి హతమార్చుతున్న విషయం తెలిసిందే. వీటిపై అప్రమత్తమైన హోం శాఖ సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment