కేసీఆర్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో రేపు (ఆదివారం) నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మోదీని కలుసుకునేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో భాగం కానుండగా.. ఏపీ సీఎం చంద్రబాబు కూడా శనివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. కాగా,ఈ సమావేశంలో ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. రైతుల ఆదాయం పెంపు, ఆయుష్మాన్ భారత్, నేషనల్ న్యూట్రీషన్ మిషన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, మిషన్ ఇంద్రధనుష్, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2:30 కి పాలక మండలి సభ్యుల చర్చ ఉంటుందనీ, సాయంత్రం 4 గంటలకు సమావేశం ముగుస్తుందనీ పీఎంవో వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment