సాక్షి, దొడ్డబళ్లాపురం: దిబ‍్బగిరికొండ పక‍్కనే ఉన‍్న కణివెపుర గ్రామం సమీపంలో చిరుత పులులు సంచరిస్తున్నాయి. దాంతో జనం భయంభయంగా బతుకుతున్నారు. రెండు రోజులుగా గ్రామానికి చెందిన పశువులు చిరుత దాడిలో మృత్యువాత పడ్డాయి.
గురువారం ఉదయం కూడా ఒక పశువును చిరుత చంపి తినడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి పూట ఇళ‍్లలోంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. పగటి పూట కూడా గుంపులుగా బయటికి వెళుతున్నారు.
తొలుత కుక‍్కలు దాడిచేసి పశువులను చంపాయని భావించినా పశువులను చంపిన విధానం, పాద ముద్రలను చూసిన తర్వాత ఇది చిరుతల పనే అని నిర్ధారణకు వచ్చారు. విషయం అటవీ శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. గ్రామ సమీపంలో బోను ఏర్పాటుచేసి చిరుత పులులను బంధించాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment