సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని బోయ, ఖైతీ లంబాడ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిటీ సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రామేశ్వర్ ఓరమ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి తరుణ్ ఝాతో భేటీ అయింది. అనంతరం తెలంగాణ భవన్‌లో ఎస్టీ విచారణ కమిషన్ సభ్యులు నాగు, జగన్నాథరావు, కమిషన్ కార్యదర్శి వీరమల్లుతో కలసి చెల్లప్ప విలేకరులతో మాట్లాడారు.
బోయ, ఖైతీ లంబాడ కులాలను ఎస్టీ జాబితాలో కలిపే విషయంలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాస్త్రీయంగా, సాంకేతికంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, మేధావులు, నిపుణులతో చర్చించి సిఫార్సులు చేయాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ రామేశ్వర్ ఓరమ్ సూచించారన్నారు. బోయ, ఖైతీ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో క్షేత్రస్థాయిలో గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. రెండు కులాల జీవన స్థితిగతులు, ప్రజాభిప్రాయసేకరణ, ఇతర వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేస్తామని, రాష్ట్రం కేంద్రానికి అందజేస్తుందన్నారు. కేంద్ర హోంశాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో చెల్లప్ప భేటీ
Published Tue, Nov 24 2015 3:59 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM
Advertisement