దుమారం రేపిన ఐఏఎస్ ఫొటో | Chhattisgarh IAS officer puts foot on patient's bed, says sorry on Facebook | Sakshi
Sakshi News home page

దుమారం రేపిన ఐఏఎస్ ఫొటో

Published Mon, May 9 2016 8:41 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

దుమారం రేపిన ఐఏఎస్ ఫొటో - Sakshi

దుమారం రేపిన ఐఏఎస్ ఫొటో

రాయ్పూర్: చత్తీస్గఢ్ ఐఏఎస్ అధికారి జగదీష్ సోంకర్ ఓ ఆస్పత్రికి తనిఖీకి వెళ్లినపుడు చేసిన చర్య వివాదాస్పదంగా మారింది. డాక్టర్ అయిన ఈ ఐఏఎస్ ఆస్పత్రిలో ఓ పేషెంట్ను పరామర్శిస్తూ ఆ పేషెంట్ బెడ్పై కాలుపెట్టాడు. ఈ ఫోటో పత్రికల్లోనూ, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేపింది. నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సోంకర్ క్షమాపణలు చెప్పారు. కావాలని చేయలేదని, తన చర్య ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరారు.

'నేను అనాలోచితంగా చేసిన చర్యకు బాధ్యతగా క్షమాపణలు చెబుతున్నాను. ఈ చర్యను సమర్థించుకోవడానికి మాటలు చాలవు. అయితే కావాలని ఇలా చేయలేదు. ఇలాంటి ప్రవర్తన వల్ల సివిల్ సర్వీసు ప్రతిష్టకు భంగం కలుగుతుందని అర్థం చేసుకోగలను. అధికారులందరికీ క్షమాపణలు చెబుతున్నా' అని సోంకర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement