'నిర్భయ' ఘటనతో వారి జీవితం నిర్ణయిస్తారా?'
న్యూఢిల్లీ: జువైనెల్ చట్టంలో సవరణ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు వద్దే వద్దంటూ బాలల హక్కుల కార్యకర్తలు నిరసన చేపట్టారు. హీనమైన నేరాలతో సంబంధం ఉండే 16 నుంచి 18 ఏళ్ల వయసుగల వారికి కూడా శిక్ష పడేలా సవరణ చేసేందుకు ఉద్దేశించిన జువైనెల్ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం చర్చిస్తామని కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అసలు ఆ బిల్లు తీసుకురావొద్దంటూ బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన లేవనెత్తారు. 'దురదృష్టవశాత్తు జరిగిన ఒక నిర్భయలాంటి కేసు మొత్తం బాల నేరస్తుల జీవితాన్ని నిర్ణయించలేదని మేం అనుకుంటున్నాం' అని బాలల హక్కుల కార్యకర్త కుమార్ వీ జాగిర్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే బాల నేరస్తుల విషయంలో పలుమార్లు ఉద్దేశించిన చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పారు. ఒక వేళ ఇందులో చట్ట సవరణ చేయాల్సి వస్తే తప్పనిసరిగా దేశ వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.