juvenile convict
-
‘నిర్భయ’ బాలనేరస్తుడి ఫేక్ ఫొటో.. వైరల్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది.. ఆరుగురు దోషుల్లో ఒకడు చనిపోగా, నలుగురికి మరణశిక్ష పడింది. శిక్షల అమలుపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.. ఇక ఈ కేసులో అందరి దృష్టినీ ఆకర్షించిన బాలనేరస్తుడు.. మూడేళ్ల శిక్ష అనంతరం విడుదలైన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు అతనికి సంబంధించిన వివరాలేవీ బయటికిరాలేదు.. కానీ ఆ బాలనేరస్తుడి పేరుతో ఓ నకిలీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘ఇతను నిర్భయ కేసులో బాలనేరస్తుడు. పేరు .........., ఢిల్లీలో మూడేళ్లు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రస్తుతం వాడు దక్షిణభారతంలో ఉంటున్నట్లు తెలిసింది. హోటళ్లలో సర్వర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదే వాడి ఫొటో.. వెతకండి.. అంతటి దారుణానికి పాల్పడినవాణ్ని పనికిరాకుండా చేసేయండి లేదా పైకి పంపేయండి..’’ అనే మెసేజ్ వాట్సప్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. ట్విటర్, ఫేస్‌బుక్‌లోనూ ఇంతే! అయితే ఇది నకిలీ ఫొటోఅని విశ్వసనీయంగా తెలినట్లు ప్రఖ్యాత ఏఎల్టీ న్యూస్ వెబ్సైట్ ఒక కథనాన్ని రాసింది. ‘‘హోం నుంచి విడుదలైన తర్వాత ఆ బాలనేరస్తుడి బాధ్యతను ఓ స్వచ్ఛంద సంస్థ తీసుకుంది. అతని పేరుగానీ, ఫొటోగానీ, ఇతర వివరాలేవి బయటికిరాలేదు. బాలనేరస్తుడిదిగా చెబుతోన్న ఆ ఫొటోను ఓ ట్విటర్ ఖాతా నుంచి తీసుకున్నారు. ఆ ఖాతా 2013లో మొదలైంది. ఇప్పటివరకు దానినుంచి రెండు ట్వీట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి ఆ సమయంలో నిర్భయ నేరస్తులంతా జైలులోనే ఉన్నారు. కాబట్టి ఆ ట్వీటర్ ఖాతా ఖచ్చితంగా నేరస్తుడిదిమాత్రం కాదు. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ప్రచారమిది. ఇలాంటి మెసేజ్‌లు మీకొస్తే స్పందించకండి..’’ అని పలు స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నట్లు ఏఎల్టీ న్యూస్ తెలిపింది. వైరల్ అయిన నకిలీ మెసేజ్..(బ్లర్ చేశాం) -
వయసు తగ్గిస్తే నేరాలు తగ్గుతాయా?
జువైనెల్ చట్టంలో సవరణ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును సీపీఎం వ్యతిరేకిస్తోంది. 16 ఏళ్ల వయసున్న బాలురను వయోజనులుగా పరిగణించడం పూర్తిగా తప్పని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన సవరణకు తాము వ్యతిరేమని, రాజ్యసభలో దీన్ని అడ్డుకుంటామన్నారు. సెలక్ట్ కమిటీకి ఈ బిల్లును పరిశీలనకు పంపించాలని ఆమె డిమాండ్ చేశారు. బాల నేరస్తుడిని తీవ్రవవాదులను ఉంచే జైలుకు తరలించడాన్ని తప్పు బట్టిన ఆమె.. వయసు తగ్గించినంత మాత్రం స్త్రీలపై హింస ఆగుతుందని, న్యాయం జరుగుతుందని తాము భావించడం లేదన్నారు. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేసే పటిష్టమైన వ్యవస్థ కావాలన్నారు. మరోవైపు అసలు ఈ బిల్లు తీసుకురావొద్దంటూ బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చట్ట సవరణ చేయాల్సి వస్తే తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరగాలని బాలల హక్కుల కార్యకర్త కుమార్ వీ జాగిర్దార్ డిమాండ్ చేశారు. అటు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కాగా నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో శిక్షపడిన బాలనేరస్తుడి విడుదలను వ్యతిరేకిస్తున్న నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ మహిళా సంఘం నేతలు పోరాటానికి దిగారు. -
'నిర్భయ' ఘటనతో వారి జీవితం నిర్ణయిస్తారా?'
న్యూఢిల్లీ: జువైనెల్ చట్టంలో సవరణ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు వద్దే వద్దంటూ బాలల హక్కుల కార్యకర్తలు నిరసన చేపట్టారు. హీనమైన నేరాలతో సంబంధం ఉండే 16 నుంచి 18 ఏళ్ల వయసుగల వారికి కూడా శిక్ష పడేలా సవరణ చేసేందుకు ఉద్దేశించిన జువైనెల్ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం చర్చిస్తామని కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఆ బిల్లు తీసుకురావొద్దంటూ బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన లేవనెత్తారు. 'దురదృష్టవశాత్తు జరిగిన ఒక నిర్భయలాంటి కేసు మొత్తం బాల నేరస్తుల జీవితాన్ని నిర్ణయించలేదని మేం అనుకుంటున్నాం' అని బాలల హక్కుల కార్యకర్త కుమార్ వీ జాగిర్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే బాల నేరస్తుల విషయంలో పలుమార్లు ఉద్దేశించిన చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పారు. ఒక వేళ ఇందులో చట్ట సవరణ చేయాల్సి వస్తే తప్పనిసరిగా దేశ వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. -
ఆ బాలనేరస్తుడి విడుదల నేడే!
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో మూడేళ్లపాటు శిక్ష అనుభవించిన బాల నేరస్తుడు విడుదల కాకుండా కేంద్రం ప్రయత్నించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ‘ఈ విడుదలను ఆపేందుకు ఢిల్లీ హైకోర్టు ముందు.. అదనపు సొలిసిటర్ జనరల్ ప్రభుత్వ వాదనను వినిపించారు. అయినా కోర్టు విడుదలకే మొగ్గు చూపింది.’ అని రిజిజు చెప్పారు. కాగా, బాలనేరస్తుడిని శనివారం జువెనైల్ హోం నుంచి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. కోర్టు అధికారిక నిర్ణయం వెలవడ్డాక ఆదివారం ఆయన్ను విడుదల చేయనున్నారు. అయితే.. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై వాదనలను వినడానికి సుప్రీం కోర్టు సోమవారం అవకాశం కల్పించింది. -
రహస్య ప్రాంతానికి బాలనేరస్తుడి తరలింపు!
న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచారం కేసులో జువైనల్ నేరస్తుడిని శనివారం జువైనల్ హోం నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. సెక్యూరిటీ కారణాలకి దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా అతడిని అక్కడ నుంచి తరలించినట్లు తెలుస్తోంది. కాగా జువైనల్ నేరస్తుడు ఆదివారం విడుదల కానున్నాడు. మహిళలపై జరిగిన అకృత్యాల్లో అత్యంత హేయమైనదిగా భావించే నిర్భయ ఉదంతంలో దోషిగా నిరూపితుడై, మూడేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న బాలనేరస్తుడు(ఇప్పుడతని వయసు 20 ఏళ్లు) డిసెంబర్ 20న విడుదల కానున్న విషయం తెలిసిందే. మరోవైపు బాలనేరస్తుడు విడుదలయ్యే రోజు.. జువైనల్ హోం వద్దకు అతడి కుటుంబ సభ్యులను రప్పించి, తిరిగి అందరినీ సురక్షితంగా స్వగ్రామం చేర్చేందుకు అయ్యే రవాణా ఖర్చును ఢిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ భరించనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే బాల నేరస్తుడు హోమ్ నుంచి విడుదలయిన తర్వాత, తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అతడికి సహకరిస్తామని, టైలర్ షాప్ ఏర్పాటుచేసుకునేందుకుగానూ 10వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపుబాల నేరస్తుడి విడుదలను నిరసిస్తూ బాధితురాలు జ్యోతిసింగ్ తల్లిదండ్రులతో పాటు బంధువులు శనివారం సాయంత్రం జువైనల్ హోం వద్ద నిరసనకు దిగారు. -
వాడి విడుదల మాకు చెంపదెబ్బ
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో బాలనేరస్థుడి విడుదల తమకు చెంపదెబ్బ లాంటిదని నిర్భయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తామెంత మొరపెట్టుకున్నా ఆ నీచుడిని విడుదల చేయడం సమాజానికి చాలా నష్టమన్నారు. అలాంటి నేరస్తుడి మొహాన్ని ప్రపంచానికి చూపించాలని డిమాండ్ చేశారు. వాడి ముసుగు తొలగించిన అందరూ చూసేలా చేయాలని, తత్ఫలితంగా వాడు మరో అఘాయిత్యానికి తెగబడకుండా నిరోధించాలని కోరారు. ఒక స్వచ్ఛందసంస్థ అక్కున చేర్చుకున్న ఆ దుర్మార్గుడు తమ బిడ్డను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడని నిర్భయ తల్లి ఆరోపించారు. మళ్లీ అలాంటి నేరానికి పాల్పడకుండా అతణ్ని ఒక కంట కనిపెట్టి ఉండాలన్నారు. నిర్భయ వర్ధంతి సమీపిస్తున్న ఈ సమయంలో అతగాడిని విడుదల చేయడం తమకు చాలా బాధ కలిగించిందని, అయినా తాము నిస్సహాయులమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య18 ఏళ్లలోపు వయసున్న మగపిల్లలకు ధైర్యాన్నిస్తుందని వాదించారు. ఆడపిల్లలపై మరిన్ని నేరాలకు, అఘాయిత్యాలకు ఉసిగొల్పుతుందని వ్యాఖ్యానించారు. చాలామంది ఆ నేరస్తుడిని రక్షించడానికి ప్రయత్నించడం విచారకరమన్నారు. అటు నిర్భయ తండ్రి కూడా నేరస్తుడి విడుదలను వ్యతిరేకించారు. విడుదలకు ముందు అతని మానసిక స్థితిని, ఆలోచనాధోరణిని అంచనా వేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. దీన్ని నిరసిస్తూ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ మానవహక్కుల సంఘానికి ఒక మొమోరాండం సమర్పించారు.