చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటనకు వచ్చారు.
అహ్మదాబాద్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటనకు వచ్చారు. బుధవారం ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో జిన్పింగ్ బృందానికి ఘనస్వాగతం లభించింది.
చైనా అధ్యక్షుడు భారత్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. భారత్తో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్కు జిన్ రావడం విశేషం. మోడీ, జిన్ ఇద్దరూ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.