చైనా నుంచి బిహార్కు రైలు మార్గం!
బీజింగ్: ఇప్పటికే టిబెట్ మీదుగా నేపాల్కు రైలు, రోడ్డు మార్గాలను పూర్తి చేస్తున్న చైనా మరో అడుగు ముందుకేసింది. నేపాల్ సరిహద్దు గుండా బిహార్ వరకు తన రైలు మార్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. నేపాల్లోని రాసువాగధి ప్రాంతానికి కనెక్ట్ అయ్యేలా రోడ్డు రైలు మార్గం నిర్మాణానికి ఇప్పటికే ఆ దేశాల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ మార్గాన్ని చైనా 2020నాటికి పూర్తి చేయనుంది. ఆ మార్గం పూర్తయ్యే లోగానే ఇండియా, దక్షిణాసియా వంటి దేశాలతో తన సంబంధాలను విస్తరించే చర్యల్లో భాగంగా ఏకంగా బిహార్ వరకు చైనా తన రైలు మార్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేపాల్లోని రాసువాగధి నుంచి బిహార్ సరిహద్దులోని బిర్ఘంజ్ మధ్య ఈ మార్గాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య 240 కిలో మీటర్ల దూరం ఉంది.