
ఇటానగర్ / న్యూఢిల్లీ: గతేడాది డోక్లామ్ ఘటన మర్చిపోకముందే చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. చైనాకు చెందిన రోడ్డు నిర్మాణ సిబ్బంది డిసెంబర్ 28న అరుణాచల్‌ప్రదేశ్‌లోని టుటింగ్ ప్రాంతంలోకి కిలోమీటర్ మేర చొచ్చుకొచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత బలగాలు అడ్డుకోవడంతో వారంతా వెనక్కు మళ్లారని వెల్లడించాయి. ఈ ఘటనలో చైనా సిబ్బంది నుంచి రెండు ప్రొక్లెయినర్లతో పాటు పలు యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. చైనీయులు వేసిన రోడ్డుమార్గానికి అడ్డంగా భారత బలగాలు రాళ్లతో గోడను నిర్మించాయన్నారు. ఈ ప్రాంతం ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ పరిధిలోనే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఇక్కడ ఆర్మీ భారీ సంఖ్యలో చేరుకుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment