రోబో నడక సాహసం
బీజింగ్: చైనాకు చెందిన ఓ రోబో ఎక్కువ దూరం నడిచి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఇంతకు ముందున్న రికార్డును తిరగరాస్తూ 54 గంటల్లో 134 కిలోమీటర్ల దూరం నడిచింది. చాంగ్‌కింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లీ కింగ్దూ నేతృత్వంలోని బృందం ‘వాకర్ 1’ అనే నాలుగు కాళ్ల రోబోను తయారు చేసింది. ఒక్క చక్రం లేకుండా కేవలం కాళ్ల సహాయంతోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌తో ఈ రోబో నడుస్తుంది.
గిన్నిస్ రికార్డు సొంతం చేసుకునేందుకు రోబోకు ఒక్కసారి చార్జింగ్ కానీ, పెట్రోల్ కానీ పోస్తే అయిపోయేలోపు నిర్దేశిత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన రేంజర్ రోబో 65.18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2011లో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఈ రికార్డును వాకర్1 తిరగరాసింది.