ఫేక్ ఫోటోలతో మున్సిపాలిటీ కార్పొరేషన్ అభాసుపాలైంది. స్వచ్ఛ మ్యాప్ యాప్‌లో తప్పుడు ఫోటోలు అప్‌లోడ్ చేసి.. సోషల్ మీడియాలో పరువు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గురుగ్రామ్ ప్రాంతంలోని పలు సెక్టార్లలో ఫిర్యాదుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ 2016, అక్టోబర్‌లో ఓ యాప్‌ను ప్రజల్లోకి వదిలింది. తాజాగా 24 గంటల్లో కొన్ని ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయంటూ ఓ ప్రముఖ పత్రికలో ఫోటోలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే అందులోని ఓ ఫోటోను గమనించిన ఓ వ్యక్తి.. అది ఫేక్ అంటూ వాస్తవ పరిస్థితిని తెలిపే ఓ ఫోటోను తన ఫేస్‌బుక్‌లో పెట్టాడు. అంతేకాదు సదరు పత్రిక పోర్టల్‌కు దానిని ట్యాగ్ చేశాడు. దీంతో సదరు పత్రిక రిపోర్టర్ వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించగా.. అధ్వానమైన స్థితులే కనిపించాయి. దీంతో ఈ వ్యవహారం ఫేక్ అని తేలిపోగా.. సోషల్ మీడియా మున్సిపల్ కార్పొరేషన్‌పై విరుచుకుపడుతున్నారు. అయితే ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ యశ్‌పాల్ యాదవ్.. ఘటనపై విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment