చెత్త శుభ్రం చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తా | cleaning is an honour to me, says narendra modi | Sakshi
Sakshi News home page

చెత్త శుభ్రం చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తా

Published Mon, Nov 17 2014 2:37 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

చెత్త శుభ్రం చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తా - Sakshi

చెత్త శుభ్రం చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తా

విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ అద్దాల్లాంటి రోడ్లు చూసి ముచ్చట పడతామని, అదే సమయంలో మనకు మన దేశంలో చెత్తతో నిండిన రోడ్లు గుర్తుకొస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే బాపూ జయంతి రోజున స్వచ్ఛభారత్ అభియాన్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనాలో హాజరైన దాదాపు 20 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

భారత్లో అన్ని వర్గాల వాళ్లు హృదయపూర్వకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారని మోదీ చెప్పారు. చెత్తను శుభ్రం చేసుకోవడాన్ని తాను గౌరవంగా భావిస్తానని ఆయన చెప్పారు. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని, చెత్త ఎత్తడానికి చెత్తవాళ్లే రానక్కర్లేదని తెలిపారు. దీపావళి తర్వాతి రోజు ఇళ్లు శుభ్రం చేసుకోవాలంటేనే కష్టపడతామని, అలాంటిది ఊరు మొత్తాన్ని కొద్దిమంది ఎలా శుభ్రం చేస్తారని ఆయన అడిగారు. ఆస్ట్రేలియాలో ఏం నేర్చుకున్నారని అడిగితే.. శ్రమకిచ్చే గౌరవం అని చెబుతానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement