సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రికి ఢిల్లీలో భవనం కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ అకామడేషన్(సీసీఏ) నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ఢిల్లీలో స్టేట్‌భవన్ కూడా లేకపోవడంతో ఇప్పుడు రాష్ర్ట కోటాలో కేసీఆర్‌కు భవనాన్ని కేటాయించారు. కాగా, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌కి కూడా రాష్ట్ర కోటాలో భవనం కేటాయించారు. హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు గతంలో కేటాయించిన భవనాన్ని నిబంధనల మేరకు వెనక్కి తీసుకుంటూ సీసీఏ నిర్ణయం తీసుకుంది. ఇక ఆరోగ్య కారణాలరీత్యా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్‌రావత్ ప్రస్తుతముంటున్న భవనాన్ని జూన్ వరకు కేటాయించినట్లు సీసీఏ వర్గాలు తెలిపాయి.