జయలలిత ఆస్పత్రిలో.. పరిపాలన ఆమె చేతిలో..!!
జయలలిత ఆస్పత్రిలో.. పరిపాలన ఆమె చేతిలో..!!
Published Tue, Oct 4 2016 7:33 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
చెన్నై: రెండు వారాలుగా తమిళనాడు ముఖమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయకు అత్యంత విశ్వాస పాత్రులైన శశికళ, పన్నీరు సెల్వంలు సైతం ఆస్పత్రి చుట్టూనే తిరుగుతున్నారు. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ను, మంత్రులను, అధికారులను ఎవరు సమన్వయ పరుస్తున్నారు? కావేరీ జల వివాదం లాంటి విషయాలను ఎవరు చూస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? గత కొంత కాలంగా తమిళనాడు వాసులతో పాటు, దేశ ప్రజలందరికీ కలుగుతున్న సందేహం ఇది. ఈ సందేహానికి సమాధానం తిరువనంతపురానికి చెందిన 1976 ఐఏఎస్ అధికారి షీలా బాలకృష్ణన్(62).
ఈమె కనుసన్నల్లోనే పరిపాలన జరుగుతోందని విశ్వసనీయవర్గాల సమాచారం. మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఆమె మార్గదర్శ కత్వంలో పని చేస్తున్నారు. తన పేరును ఎవరికీ తెలియనీయొద్దని షీలా చాలా స్పష్టంగా అందరికీ ఆదేశాలు జారీ చేశారని సమాచారం. సెక్రటేరియట్ లోనే జయ కార్యాలయానికి పక్కనే ఒక చిన్న గదీలోంచి ఆమె మానిటరింగ్ చేస్తున్నారు. డీఎంకే అధికారంలోకి ఉన్నప్పుడు షీలా పక్కన పెట్టారు. జయలలిత అధికారంలోకి రాగానే ఆమెను పర్సనల్ అడ్వైజర్ గా నియమించారు.
Advertisement