
సీల్డ్ కవర్ లో సీఎం పేరు
బెంగళూరు: తమిళ రాజకీయాలకు కర్ణాటక కేంద్ర బిందువుగా మారింది. బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలితతో తమిళనాడు ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. తన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోపెట్టాలనే దానిపై 'అమ్మ' ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తనను కలిసిన ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ కు సీల్డ్ కవర్ అందించారని, అందులో సీఎం ఎవరనేది పేర్కొన్నారని చెబుతున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు అన్నాడీఎంకే శాసనసభపక్షం సమావేశమవుతోంది. ఈ భేటీ తర్వాత సీఎం అభ్యర్థి పేరు వెల్లడించే అవకాశముంది. ఒకట్రెండు రోజుల్లో కొత్త సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశలున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.