మహారాష్ట్రలో సంకీర్ణం! | Coalition in Maharashtra! | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో సంకీర్ణం!

Published Sun, Oct 19 2014 10:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

మహారాష్ట్రలో సంకీర్ణం! - Sakshi

మహారాష్ట్రలో సంకీర్ణం!

ముంబై: మహారాష్ట్రలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశంలేదు. బీజేపీ ఎక్కువ స్థానాలలో మెజార్టీలో ఉంది. అయితే ఆ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడంలేదు. శివసేన రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానం కోసం కాంగ్రెస్, ఎన్సీపి పోటీ పడుతున్నాయి. రాజ్ ఠాక్రే  పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి(ఎంఎన్ఎస్) 4 స్థానాలలో మాత్రమే ఆధిక్యతలో ఉంది.

హర్యానాలో బీజేపీ 51 స్థానాలలో లీడింగ్తో మెజార్టీ స్థానాలు గెలుచుకునే దిశగా వెళుతోంది. ఇక్కడ బీజేపి ఎవరి మద్దతులేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి ఎందిగింది. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఆ పార్టీకి పరాభవమే మిగిలింది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆధిక్యతలో ఉన్న పార్టీల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం:
మహారాష్ట్రలో మొత్తం స్థానాలు -  288
బీజేపీ ఆధిక్యం - 108
శివసేన - 65
కాంగ్రెస్ - 50
ఎన్సీపి- 43
ఎంఎన్ఎస్ 4
ఇతరులు - 18

హర్యానాలో మొత్తం స్థానాలు - 90
బీజేపీ ఆధిక్యం  - 48
కాంగ్రెస్ - 14
ఐఎన్ఎల్డీ- 20
హెచ్జేసీ - 03
ఇతరులు - 5
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement