ఆరేళ్లప్రాయంలోనే ఆసియా రికార్డు.. | Coimbatore girl sets Asia record in speed skating | Sakshi
Sakshi News home page

ఆరేళ్లప్రాయంలోనే ఆసియా రికార్డు..

Published Sun, Mar 13 2016 6:14 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

ఆరేళ్లప్రాయంలోనే ఆసియా రికార్డు..

ఆరేళ్లప్రాయంలోనే ఆసియా రికార్డు..

కోయంబత్తూరు: ఆరేళ్లప్రాయంలోనే తమిళనాడుకు చెందిన ఓ బాలిక స్కేటింగ్‌లో ఆసియా రికార్డులోకి ప్రవేశించింది. కేవలం 41.3 నిమిషాల్లోనే 10.5 కిలోమీటర్ల వరకు వేగంగా స్కేటింగ్‌ చేసి ఆసియాలో తొలి రికార్డు సృష్టించింది. తమిళనాడులో యువభారతి పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న కె దర్శని (6)విద్యార్థిని క్వార్టర్‌ స్కేటింగ్‌ మారథాన్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్కేటింగ్‌ పోటీలో పాల్గొంది. ఈ పోటీలో పాల్గొన్న చిన్నారి.. అత్యంత వేగంగా స్కేటింగ్‌ చేసి ఆసియాలో రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఆదివారం కోయంబత్తూరులో తమిళనాడు స్పీడ్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌(టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ) జనరల్‌ సెక్రటరీ మురుగానందం మాట్లాడుతూ.. స్కేటింగ్‌లో ఆసియాలో ఈ తరహా రికార్డ్‌ సృష్టించడం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు.

150 బంగారు పథకాలను కైవసం చేసుకున్న చిన్నారి దర్శని.. 2014లో నిర్వహించిన కోయంబత్తూరు జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా 500 మీటర్ల స్కేటింగ్‌లోనూ, అదే ఏడాది తమిళనాడు రాష్ట్ర రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ అద్భుతంగా స్కేటింగ్‌ చేసి ప్రతిభను కనబర్చింది. గతనెలలో గోవాలో జాతీయ స్థాయిలో టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కేటింగ్‌ పోటీల్లో చిన్నారి దర్శని.. బంగారు, కాంస్య పథకాలను సాధించింది. వచ్చే నెల సింగపూర్‌లో అంతర్జాతీయ స్థాయిలో జరిగే స్కేటింగ్‌ పోటీల్లో చిన్నారి దర్శనిని టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ ఎంపికచేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement