టీ.నగర్: ఒక గంట సమయంలో 60 పాటలు పాడి రాజేష్ వైద్య ఆదివారం రికార్డ్ సాధించాడు. వీణ విద్వాంసుడిగా మేస్ట్రో అవార్డును అందుకున్న రాజేష్ వైద్య ప్రముఖ సంగీత దర్శకుడు జి.రామనాధన్ తమ్ముడి కుమారుడు. రాజేష్‌వైద్య తన బృందంతో 60 నిమిషాల్లో 60 పాటలు పాడి ఆసియా స్థాయిలో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డు సృష్టించారు. ఆసియా దేశంలో గల ప్రముఖులను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఆ సంస్థ వెలుగులోకి తీసుకువస్తున్నది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజేష్‌వైద్య రికార్డును నెలకొల్పడంతో అనేక మంది నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రసన్న, నటి సుహాసినిలు పాల్గొని రాజేష్‌వైద్యను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment