సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, చత్తీస్‌గఢ్‌లో కూడా 15 ఏళ్ల బీజేపీ పాలకను తెరపడబోతోందని, అలాగే ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో ఉన్న మిజోరం రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ నవంబర్‌లో నిర్వహించిన ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడబోవడం విశేష పరిణామం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 41.6 శాతం ఓట్లతో 116 నుంచి 120 సీట్లను గెలుచుకోబోతుండగా, పాలకపక్ష బీజేపీ పార్టీ 39.3 శాతం ఓట్లతో 98–102 స్థానాలకు పరిమితం కాబోతోంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల వివరాలు (అంచనా)
పార్టీ | ఓట్ల శాతం | గెలుచుకునే సీట్లు |
కాంగ్రెస్ | 41.6 % | 116-120 |
బీజేపీ | 39.3 % | 98-102 |
బీఎస్పీ | 4.2 % | 0-2 |
ఇతరులు | 14.9 % | 2-5 |
చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల వివరాలు (అంచనా)
పార్టీ | ఓట్ల శాతం | గెలుచుకునే సీట్లు |
కాంగ్రెస్ | 41. % | 43-45 |
బీజేపీ | 40 % | 40-42 |
జేసీసీ-బీఎస్పీ | 11 % | 2-3 |
ఇతరులు | 8 % | 0-1 |
ఇక బహుజన సమాజ్ పార్టీ 4.2 శాతం ఓట్లతో 0–2 సీట్ల వరకు, ఇతరులు 14.9 శాతం ఓట్లతో రెండు నుంచి ఐదు సీట్ల వర కు కైవసం చేసుకోబోతోంది. చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా రాణించినప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకే కాస్త ఆధిక్యత లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఓట్లతో 43 నుంచి 45 సీట్లు, బీజేపీకి 40 శాతం ఓట్లతో 40 నుంచి 42 సీట్లు, జేసీసీ–బీఎస్పీ 11 శాతం ఓట్లతో రెండు నుంచి మూడు సీట్లు, ఇతరులు ఎనిమిది శాతం ఓట్లతో ఒక్క సీటు సాధించే అవకాశం ఉంది. అదే మిజోరంకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మిజో నేషనల్ ఫ్రంట్‌కు 15–19 సీట్లు, పాలకపక్ష కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 19 సీట్లు, జోరమ్ పీపుల్స్ ఫ్రంట్‌కు 2–4 సీట్లు, బీజేపీకి 0–2 సీట్ల వరకు రావచ్చని సర్వేలో తేలింది.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల వివరాలు (అంచనా)
పార్టీ | గెలుచుకునే సీట్లు |
కాంగ్రెస్ | 14-19 |
ఎంఎన్‌ఎఫ్ | 15-19 |
జెడ్‌పీఎం | 2-4 |
బీజేపీ | 0-2 |
మిజోరం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడు కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్‌ల మధ్యనే ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. తొలిసారిగా బీజేపీ మిజోరం ఎన్నికల్లోకి దిగడం, కొత్తగా ఏర్పడిన జోరమ్ పీపుల్స్ ఫ్రంట్‌కు కూడా పలు స్థానాల్లో పోటీ చేస్తుండడం వల్ల తొలిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. పీపుల్స్ పల్స్ ప్రతినిధులు మిజోరంలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు సర్వే నిర్వహించగా, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 18 నుంచి 26వ తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు.మధ్యప్రదేశ్‌లోని ఆరు భిన్న ప్రాంతాల్లో ఓటర్ల మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించగా ఎక్కువ ప్రాంతాల్లో బీజేపీ నష్టపోతున్నట్లు తెల్సింది.
చంబల్, గ్వాలియర్ రీజన్‌లో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బుందేల్‌ఖండ్, బఘేల్‌ఖండ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఎక్కువగా ఉంది. మహాకోశల్ ప్రాంతంలో పాలక పక్ష బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి పోటా పోటీగా ఉంది. మాల్వా రీజన్‌లో కాంగ్రె‹స్‌కు, భోపాల్ రీజన్‌లో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment