దేశంలో 24 గంటల్లోనే 591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో, ప్రస్తుతం భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 5,865 కు పెరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం 477 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇలావుండగా, కరోనాపై పోరాటంలో ఇతర దేశాలకు భారత్ సహాయం అందిస్తుంది. కరోనాకు వ్యాక్సిన్ లేదు. మలేరియా నియంత్రణకు వాడే హైడ్రాక్సి క్లోరోక్విన్ కరోనాపై సత్ఫలితాలు ఇస్తుండంతో ఈ మెడిసిన్‌కు డిమాండ్ బాగా పెరిగింది. కరోనా రోగుల ప్రాణాలు కాపాడటంలో పలు దేశాలు దీన్నే వాడుతున్నాయి.
అంతేకాకుండా ప్రపంచంలోనే ఈ మెడిసిన్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం మనదే కావడంతో పలు దేశాలు హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను పంపించాలంటూ భారత్‌ను కోరుతున్నాయి. ఇప్పటికే భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్, సీషెల్స్, మారిషస్ దేశాలకు ఈ మందు పంపినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంకకు మంగళవారం 10 టన్నుల మెడిసిన్ పంపినట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పదిహేను లక్షలమంది కోవిడ్ -19 బారిన పడ్డారని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. వారిలో 3,25,000కి పైగా కోలుకున్నారని తెలిపంది. కరోనా కాటుకు ఇప్పటివరకు 85,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment