న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా కేసులు నమోదు కాగా, 170 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,51,767కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 64,425 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,337 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 83,004 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా రోజువారి కేసుల సంఖ్యలో కొద్దిగా తగ్గుదల కనిపిస్తోంది.
మహారాష్ట్రలో అత్యధికంగా 54,758 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 16,954 మంది కోలుకోగా, 1,792 మంది మృతిచెందారు. ఆ తర్వాత తమిళనాడు(17,728), గుజరాత్(14,821), ఢిల్లీ(14,465)లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment