
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,990 కొత్త కేసులు నమోదు కాగా, 49మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనా మహమ్మారి బారినపడి మరణించినవారి సంఖ్య 824కు పెరిగింది. భారత్‌లో ఇప్పటి వరకు 26,496 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే 5,803 మంది కోలుకున్నారు. ఇక గుజరాత్, మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. (కరోనా: వాళ్లంతా సేఫ్... )
మరోవైపు ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. అందులో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది అమెరికాలో మరణించగా మూడో వంతు కేసులు అక్కడే నమోదయ్యాయి. (కరోనా : హాయిగా.. స్వేచ్ఛగా విహరిస్తాం)
Comments
Please login to add a commentAdd a comment