సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 1396 కొత్త కేసులు నమోదు కాగా, 48 మంది కరోనా మహమ్మారి బారినపడి మరణించారు. దీంతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా మృతి చెందినవారి సంఖ్య 872కు చేరిందని ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 20,835 కాగా, 6,185 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం కరోనా వైరస్‌పై పోరులో తదుపరి చర్యలను చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. (కేంద్రమంత్రిని వెంటాడుతున్న కరోనా భయం!)
కాగా దేశంలో అత్యధికంగా ఏప్రిల్ 24న 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ రికార్డును తిరగరాస్తూ ఆదివారం తాజాగా 1,975 కేసులు బయటపడడం గమనార్హం. అలాగే మహారాష్ట్రలో 342 మంది కరోనాతో మృతి చెందగా, గుజరాత్‌లో 151మంది మరణించారు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,001కి చేరింది. ఇప్పటివరకూ 25 చనిపోగా, 316 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 1097కి చేరగా, 31మంది మరణించారు. 231మంది చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివ్ కేసులు సంఖ్య 835గా ఉన్నాయి. (ఒక్కరోజులో 1,975 కేసులు)
- మహారాష్ట్రలో 8,068 పాజిటివ్ కేసులు, 342 మంది మృతి
- గుజరాత్‌లో 3,301 పాజిటివ్ కేసులు, 151 మంది మృతి
- ఢిల్లీలో 2,918 పాజిటివ్ కేసులు, 54 మంది మృతి
- రాజస్థాన్‌లో 2,185 పాజిటివ్ కేసులు, 41 మంది మృతి
- మధ్యప్రదేశ్‌లో 2,090 పాజిటివ్ కేసులు, 103 మంది మృతి
- తమిళనాడులో 1,885 పాజిటివ్ కేసులు, 24 మంది మృతి
- యూపీలో 1,873 పాజిటివ్ కేసులు, 30 మంది మృతి
- పశ్చిమబెంగాల్‌లో 611 పాజిటివ్ కేసులు, 20 మంది మృతి
- జమ్మూకశ్మీర్‌లో 523 పాజిటివ్ కేసులు, ఆరుగురు మృతి
- కర్ణాటకలో 503 పాజిటివ్ కేసులు, 19 మంది మృతి
- కేరళలో 469 పాజిటివ్ కేసులు, నలుగురు మృతి
- పంజాబ్‌లో 322 పాజిటివ్ కేసులు, 18 మంది మృతి
- హర్యానాలో 296 పాజిటివ్ కేసులు, ముగ్గురు మృతి
Comments
Please login to add a commentAdd a comment