భోపాల్: కరోనా నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లిన వైద్యులు, స్థానిక అధికారులపై దాడి ఘటన మరువకముందే మధ్యప్రదేశ్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. వీధులు శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బందిపై ఓ అల్లరిమూక దాడికి పాల్పడింది. దీవాస్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కోయ్లా మొహల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముస్లిం జనాభా అధికంగా ఉండే ప్రాంతంలో పారిశుధ్య కార్మికులు విధుల నిమిత్తం వెళ్లారు. అయితే, స్థానికంగా ఉండే ఆదిల్ అనే వ్యక్తి తమతో గొడవపడ్డాడని, గొడ్డలితో దాడిచేశాడని కార్మికులు చెప్తున్నారు.
(చదవండి: వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారి అరెస్ట్)
ఈ దాడిలో ఓ కార్మికుడి చేతికి బలమైన గాయమైంది. అతన్ని దీవాస్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్మికుల ఫిర్యాదు మేరకు ఆదిల్, అతని సోదరునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశామని పోలీస్ అధికారి సజ్జన్ సింగ్ తెలిపారు. ఆదిల్‌ను స్టేషన్‌కు తరలించామని, పరారీలో ఉన్న అతని సోదరుని కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. కాగా, కార్మికులపై స్థానికులు దాడి చేస్తున్న వీడియో బయటికొచ్చింది. ఇక రాష్ట్ర రాజధాని భోపాల్‌లో లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై ఇటీవల రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1310 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 69 మంది మృతి చెందారు. మరో 69 మంది కోలుకున్నారు. 1172 యాక్టివ్ కేసులున్నాయి.
(చదవండి: 21 మంది నావికులకు కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment