తమిళనాడులో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ | Coronavirus :Total Lockdown In Four Tamil Nadu districts | Sakshi
Sakshi News home page

తమిళనాడులో మరోసారి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌

Published Mon, Jun 15 2020 4:48 PM | Last Updated on Mon, Jun 15 2020 6:54 PM

Coronavirus :Total Lockdown In Four Tamil Nadu districts - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాలో మరోసారి పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తూ  రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్‌ సోమవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, చంగల్‌పట్టు, తిరువెళ్లూర్‌లో జిల్లాలో ఈనెల 19నుంచి 30 వరకు లాక్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయా జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి 2గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 33శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అత్యవరస పరిస్థితుల్లో మాత్రమే ఆటోలు, టాక్సీలకు అనుమతి ఉంటుందని సూచించింది. 
(చదవండి : కరోనా‌: రాజస్తాన్‌ సీఎం కీలక ప్రకటన)

కాగా, తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 1,974 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రసుతం రాష్ట్రంలోకరోనా సోకినవారి సంఖ్య 44, 661కు చేరింది. కరోనా బారినపడి ఇప్పటి వరకు 435 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 24,547 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం 19,676 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement